నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామంలో శనివారం సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రగుడు పరశురాములు, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. బండి సంజయ్ కార్యక్రమంలో జై కాంగ్రెస్.. గో బ్యాక్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన బండి సంజయ్ భద్రత సిబ్బంది పోలీస్ బలగాలు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.