– ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్లే
– ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-నవాబుపేట్
‘ఆరోగ్య రథం’ పేద ప్రజలకు సంజీవిని అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆరోగ్య చేవెళ్ల సాధనలో భాగంగా శనివారం మండలం ఎల్లకొండలో ఎమ్మెల్యే కాలె యా దయ్య ‘ఆరోగ్యరథం’ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ..ఆరోగ్యం బాగుంటే అన్ని ఉన్నట్లే, ఆరోగ్యం బాగాలేకుంటే ఎంత ఆస్తులు ఉన్నా ఏమీ లేనట్లే అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత నిధులతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించారన్నారు. ఈ ఆరోగ్య రథాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్లకొండ సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభు త్వం సంక్షేమమంతో పాటు వైద్య ఆరోగ్యానికీ పెద్దపీట వేసిందన్నారు. చేవెళ్లల్లో వంద పడకల ఆస్పత్రి మంజూర యిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ, పోలీస్ రాంరెడ్డి, కందడా నాగిరెడ్డి, ప్రశాంత్ గౌడ్, ఆనంద్ రెడ్డి, అజరు కుమార్, దయాకర్ రెడ్డి, శ్రీవాస్ గౌడ్, ప్రకాశం, పూరషోత్తం, నరేందర్ రెడ్డి, గుడిసె ప్రకాష్, ఉపసర్పంచ్ మానస ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు, నాయకులున్నారు.