పిపిఎల్‌ ఇండియా స్వతంత్ర డైరెక్టర్‌గా సంజరు టాండన్‌

Sanjuru Tandon as Independent Director of PPL Indiaముంబయి : అంతర్జాతీయ సౌండ్‌ రికార్డింగ్‌ లైసెన్స్‌లు కలిగిన ఫోనోగ్రాపిక్‌ ఫర్ఫామేన్స్‌ లిమిటెడ్‌ (పిపిఎల్‌) ఇండియా స్వతంత్ర డైరెక్టర్‌గా సంజరు టాండన్‌ నియమి తులయ్యారు. ప్రస్తుతం కాపీరైట్‌ అడ్మినిస్ట్రేషన్‌ తో పాటు ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసి యేషన్‌కు టాండన్‌ సిఇఒగా ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. భారత సంగీత ప్రపంచంలో కాపీరైట్‌ యొక్క కలెక్టివ్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి టాండన్‌ను తమ సంస్థలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పిపిఎల్‌ ఇండియా ఛైర్మన్‌ మందార్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.