
మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంబురాలలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు సంక్రాంతి విశిష్టతను చాటిచెప్పే ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులందరు ఉల్లాసంగా పాఠశాల ఆవరణలో గాలి పటాల్ని ఎగురవేసి సంబురంగా వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగాని అలరించాయి. ఉపాధ్యాయులు విదార్థులకు సంక్రాంతి విషష్టతను వివరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.