నవతెలంగాణ -పెద్దవూర : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పెద్దగూడెం జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలోగురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పల్లెదనం ఉట్టి పడేలా 60 మంది విద్యార్థులు,విద్యార్థినులు రంగు రంగుల రంగవల్లులు, నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ అలరించారు.ఈ పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు జనవరి 26 న బహుమతుల ప్రధానం చేస్తామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. అనంతరం భోగిమంట నడుమ సంక్రాంతి గీతాలతో నృత్యాలు ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనందోత్సవాలా నడుమ ఘనంగా మూశాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, అశోక్, గుంటుక రామాంజి రెడ్డి, గౌసోద్దీన్, సుదర్శ న్, దేవేందర్, కరుణ, గ్రామస్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.