సంక్రాంతి అంటే గుర్తొచ్చేది తెలుగు సంస్కృతే : ఎమ్మెల్యే మందుల సామేల్

నవతెలంగాణ తుంగతుర్తి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మహిళలు వేసే రంగురంగుల ముగ్గులు అని, తెలుగు సంస్కృతిని, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు యువతకు నిర్వహించిన ముగ్గుల పోటీల బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.ఈ మేరకు సమాజంలో ఆర్యవైశ్యులు చేస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబీకులు పండుగ చేతికి వచ్చిన తర్వాత చేసే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. ముఖ్యంగా పండుగ మూడు రోజులు భోగి మొదలు కనుమదాక రోజు తీరొక్క ముగ్గులతో వాకిళ్లను అలంకరిస్తారని అన్నారు. ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గులకు చాలా ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ ముగ్గులు తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో ప్రతిభ కనపరిచిన పాల్గొన్న వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండగడుపుల యాకయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్రావు, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, కొండ నాగరాజు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి సత్యనారాయణ, పాలవరపు సంతోష్, గౌరవ అధ్యక్షులు ఈగ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఈగ నాగన్న, కోశాధికారి వెంకన్న, మహిళా అధ్యక్షురాలు తల్లాడ సూర్యకళ, కేదారి దయాకర్ ఓరుగంటి సుభాష్, మిట్టగడుపుల ఆనోక్, రేట్నేని శ్రీనివాస్,మడ్డి కృష్ణమూర్తి, పీఈటీలు సుభాషిని కృష్ణవేణి మహిళలు తదితరులు పాల్గొన్నారు.