నవతెలంగాణ-ఏర్గట్ల : ఏర్గట్ల మండలకేంద్రంలోని నలంద ప్రైవేట్ పాఠశాలలో కరస్పాండెంట్ వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు.అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.