పరకాల పట్టణంలోని శారద ఐఐటి విద్యాలయంలో శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు ముగ్గుల ప్రదర్శన నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి వాతావరణాన్ని తలపించేలా అందరు అలంకరించారు.గంగిరెద్దు హరిదాసులు గాలిపటాలు గ్రామీణ నేపథ్యాన్ని తలపించేలా సంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. ఇందులో భాగంగా చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. అనంతరం భోగి మంటలు వేసి పరమాన్నం వండారు. శారద విద్యాలయం ప్రిన్సిపల్ మార్క సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రాంతంలో జరుపుకునే సంక్రాంతి పండుగ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు