ఫ్యాన్స్‌కి సంక్రాంతి గిఫ్ట్‌

ఫ్యాన్స్‌కి సంక్రాంతి గిఫ్ట్‌రాబోయే సంక్రాంతి ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు రెట్టింపు సంతోషాన్ని తీసుకు రాబోతోంది. ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ ఇప్పటిదాకా చూడని ఒక కొత్త లుక్‌లో, క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ప్రభాస్‌తో చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ గురించి నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అప్డేట్‌ను షేర్‌ చేసింది. డైనోసార్‌ డార్లింగ్‌గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి. సంక్రాంతి కానుకగా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేస్తున్నాం అంటూ ఈ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘భలే భలే మగాడివోరు, మహానుభావుడు, ప్రతి రోజు పండగే’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ మారుతి ప్రభాస్‌ను సరికొత్తగా సిల్వర్‌ స్క్రీన్‌ పై ప్రెజెంట్‌ చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పైగా ఇటీవల రిలీజైన ‘సలార్‌’ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. రికార్డ్‌ స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై అందరీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందనే దీమాని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.