– ఈనెల 16న ప్రారంభించనున సర్పంచ్ గుండు మనిష్ గౌడ్
నవతెలంగాణ భువనగిరి రూరల్: మండలంలోని వడాయిగూడెంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బబ్బూరి చిన్న సుమన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నీల ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన జనవరి 16వ, తేదీన మంగళవారం ఉదయం 7.00 గంటలకు ముగ్గుల పోటీలను సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ప్రారంభించనున్నట్టు కోశాధికారి గుండు రవి గౌడ్ తెలిపారు.
ముగ్గుల పోటీలలో పాల్గొనే వారికి బహుమతుల వివరాలు,
ముగ్గుల పోటీల్లో ప్రతి ఒక్క మహిళకు ₹ 500/- చీర,
మొదటి బహుమతి 15 తులాల వెండి,
రెండవ బహుమతి 10 తులాల వెండి,
మూడవ బహుమతి 5 తులాల వెండి,
4,5,6 బహుమతులుగా ముత్యాల హారం,
7, 8,9 బహుమతులుగా మహిళా వాచ్‌లు ,
10,11,12 బహుమతులుగా ప్రెషర్ కుక్కర్లు అందజేస్తారు.
డి జె దాత కళ్లెం క్రిష్ణ గౌడ్, లైనింగ్ దాత దాదాపు ₹10,000 విలువగల లైనింగ్ చేస్తున్న జక్కుల చంద్రయ్య యాదవ్, బొడ్రాయి సెంట్రల్‌లో ముఖ్య అథితిగా ప్రముఖ యూట్యూబ్ డాన్సర్ జానులిరి హాజరుకానున్నట్లు తెలిపారు. పోటీల అనంతరం సర్పంచ్, అతిథులు, ఉత్సవ కమిటీ నాయకుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానోత్సవం జరుగుతుంది. జాతీయ సమైక్యత, మన సంస్కృతి, సంప్రదాయం, గ్రామ అభివృద్ధి ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు ఉండాలి. బహుమతుల అనంతరం మిథిలానగర్‌లో జక్కుల చంద్రయ్య యాదవ్ ఇంటి వద్ద, సిఈఓ నోముల నర్సింహ్మ యాదవ్ ఆధ్వర్యంలో మిత్రులకు బోజనాలు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.