బీజేపీ మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ..

Sankranthi muggle competitions under the leadership of BJP Goat Keerti Harsha Kiran..నవతెలంగాణ – ఓయూ
సికింద్రాబాద్ అసెంబ్లీ సీతాఫల్మాండి డివిజన్  బీదల బస్తీలో శనివారం సాయంత్రం మేకల కీర్తీహర్షకిరణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు  పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు. 100 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొనగా  ముగ్గురిని విజేతలుగా ఎంపిక చెసి వారీతో పాటు పోటీలో పాల్గొన్న  అందరికీ బహుమతులను నిర్వహకులు మేకల కీర్తి హర్షకిరణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  జిల్లా పార్టీ అధ్యక్షులు బూర్గుల శ్యాంసుందర్ గౌడ, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల.సారంగపాణి, రాచవల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, డివిజన్ మాజీ అధ్యక్షులు అంబాల  రాజేశ్వరరావు, హనుమంతు ముదిరాజ్, భాస్కర్ గిరి, బిజెపి డివిజన్ అధ్యక్షులు ఇవి నరేష్ , అనిత, అనూష, నాగమల్లేశ్వరి, కళావతి, నాగరాణి, సతీష్ ముదిరాజ్, ముఠా గణేష్, రాజేష్ ముదిరాజ్, సింహాచలం బాబు, శైలజ, సరిత, మేరీ, యాదమ్మ, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలూ ఎంతగానో ఆనందించారు.ఇలా అక్కాచెల్లెలు భారీ గా వచ్చి పాల్గోవడం ఎంతో సంతోషంగా ఉంది అని  మేకల కీర్తి అక్షర అన్నారు.సంక్రాంతి అంటే నే రంగురంగుల ముగ్గులు , పిండివంటలు, గాలిపటాలు , గంగిరెద్దులూ ఇలా అన్ని కలబోసిన మన తెలుగు పండగ అని మేకల కీర్తి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో నిర్వహిస్తాము ఆన్నారు. సంతోషకరమైన వాతావరణంలో  ముగ్గుల పోటీ నిర్వహించడం అందులో దేశభక్తికి సంబంధించిన, కాలుష్య వాతావరణం , పర్యావరణానికి సంబంధించిన సంక్రాంతి  ముగ్గులు వేసిన ముగ్గురికి విజేతలకు ప్రత్యేకమైన బహుమతులు , పాల్గొన్న అందరికీ  శ్యాంసుందర్ గౌడ్  బహుమతులను అందజేశారు.