కొడిచర గ్రామంలో సంత్ రోహిదాస్ మహారాజ్ జయంతి ధర్మ జాగరణ

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని కొడిచరా గ్రామంలో సంత్ రోహిత్ మహారాజ్ జయంతి ధర్మ జాగరణ కార్యక్రమం జరుగుతుంది. సంత్ రోహిదాస్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మోచి సంఘము ఆధ్వర్యంలో ధర్మజాగరణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భజన కీర్తనలు జరుగుతున్నాయి. సంత్ రోహిదాస్ మహారాజ్ సేవల గురించి, కీర్తి గురించి మోచి సంఘం పెద్దలు గ్రామస్తులు భజన కీర్తనల ద్వారా ఆయన అందించిన సేవలు ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడుచుకునెలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొనియాడారు.