నవతెలంగాణ – కోహెడ
మండలంలోని ధర్మసాగర్‌పల్లి గ్రామ జూమ్‌లాల్ తండాలో బంజార కులదైవమైన ముత్యాలమ్మ సంత్ సేవాలాల్ నవమి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి, డప్పు చప్పుల్లతో, మహిళలు నెత్తిన భోనంతో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని తమ మొక్కులు సమర్పించుకున్నారు. కోరిన కోర్కెలను తీర్చే ముత్యాలమ్మ వేడుకలను ప్రతియేడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బానోతు విజయ, భద్రుస్వామిలు తెలిపారు. వర్షాలు సంమృద్దిగా కురిసి, తమ పిల్లపాపలు సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకన్న స్వామి, బాలు, బానోతు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.