– ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్
– ఆయన దేవాలయం నిర్మించడం అభినందనీయం
– మదనపల్లి పాత తండాలో జగదాంబ సేవలాల్ విగ్రహ ప్రతిష్టాపన
నవతెలంగాణ-శంషాబాద్
సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం ఆదర్శనీయ మని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. శంషాబాద్ మండల పరిధిలోని మదనపల్లి పాతతండా గ్రామంలో గిరిజనుల ఆరాధ్యులు జగదాంబ-సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌ల కోసం మండల వైస్ ఎంపీపీ నీలం మోహన్, గ్రామ మాజీ సర్పంచ్ వి.రవీందర్ ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేశారు. గుడిలో ఆ దంపతుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం జరిగింది. గ్రామస్తులు నీళ్ల కళాశాలను సమర్పించారు. దీంతోపాటు ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఈ కా ర్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు.. గిరిజనులకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని అన్నారు. సంచార జాతులుగా కొనసాగుతున్న లంబాడ జాతి ఐక్యత కోసం మార్గం చూపి ఎంతోమంది జీవితాలలో సేవాలాల్ వెలుగులు నింపారని కొనియాడా రు. ఆయన మార్గం ఒక్క లంబాడ సామాజిక వర్గానికి కా కుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తినిస్తుంద న్నారు. ఆయన చూపిన మార్గాన్ని వదలకుండా లంబాడ జాతి గుర్తింపు ఇస్తూ దేవాలయాలు నిర్మిస్తుండడం అభి నందనీయమని అన్నారు. సేవాలాల్ స్ఫూర్తితో లంబాడీ ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగ డానికి పలువురికి సేవ చేయడానికి కృషి చేయాలని పిలు పునిచ్చారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నీలం మోహన్ నాయక్ మాట్లాడుతూ ఎంతోమంది జీవితాల్లో వెలుగై మార్గదర్శకుడై అనునిత్యం ఉత్తేజం ప్రేరణ కలిగిస్తూ గొప్ప వ్యక్తిగా సేవాలాల్ నిలిచిపోతారని అన్నారు. ఆదర్శ దంపతుల విగ్రహాలు గ్రామంలో ప్రతిష్టించడం చాలా సం తోషంగా ఉందన్నారు. గిరిజన లంబాడ సామాజిక వర్గం ప్రజలంతా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తారని అన్నా రు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంక ర్, మైహౌమ్ సంస్థ యజమాని జోగినపల్లి జగపతిరావు, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజుముదిరాజ్, శంషాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కే.సుష్మమహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.