
– బంజారా భవన్ లో అధికారికంగా సంతు సేవాలాల్ జయంతి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బంజారాల ఆరాధ్యుడు సంతు సేవాలాల్ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని సూర్యాపేట ఆర్డీవో సిహెచ్ కృష్ణయ్య అన్నారు. గురువారం సంత సేవాలాల్ 285వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని బంజారా భవన్ లో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ గిరిజనులను ఐక్యంగా ఉంచేందుకు ఎనలేని కృషి చేశారని అన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవలాల్ జయంతి అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.అనంతరం ఉత్సవ కమిటీ సభ్యుల మాట్లాడుతూ సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం హర్షనియమన్నారు. నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఉత్సవ కమిటీ కన్వీనర్ ధరావత్ వీరన్న నాయక్, లూనావత్ పాండు నాయక్, బిక్షం నాయక్, చివ్వెంల ఎంపీపీ కుమారి బాబు నాయక్, ధరావత్ మంగ్త్యా నాయక్ ,ధరావత్ అజయ్ నాయక్, నాగు నాయక్, బాలు నాయక్, ధారాసింగ్, లచ్చిరాం నాయక్, లాలూ నాయక్, వెంకన్న నాయక్, వస్త్రంనాయక్, మోతిలాల్ హుస్సేన్ నాయక్, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.