ఘనంగా సంతు సేవాలాల్ జయంతి వేడుక

– తహసీల్దార్ కోడి చింతలరాజు
నవతెలంగాణ – నెల్లికుదురు
శ్రీ సంతు సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు శ్రీ సంతు సేవాలాల్ రతిరాం తండా గ్రామ ఆలయ పూజారి గుగులోతు జాదు నాయక్ తెలిపారు. మండలంలోని రాతిరం తండా గ్రామ శివారు మాన్య తండా గ్రామంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల తాసిల్దార్ కోడిచింతల రాజు మాజీ జెడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు గిరిజనుల ఆరాధ్య దైవం అని  అన్నారు. భోగి బండారు కార్యక్రమం నిర్వహించారు ఈ పండుగను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి మదన్ లాల్ నాయకులు రాజు సెట్ రామ్ శంకర్ బిక్కు లక్ష్మణ్ సైదులు చందులాల్ రమేష్ రఘు టి పి టి ఎఫ్ సంగం మండల నాయకుడు బాలు నాయక్ రఘు భీమా రుక్మిణి పూలి రజియా మన్నెమ్మ ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.