మొక్కలు నాటిన ఇంచార్జి ఎంపీడీఓ

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మాండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో  బుదవారం నాడు ఇంచార్జి ఎంపీడీఓ అధికారులతో కలసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కాలనీలో  వీధివీధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా కృషి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి,ఉపాధి హామీ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.