– మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించింది వనపర్తి రాజులు, నిజాం రాజులు కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పూర్వం వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజుల్లో ఒకడైన రెండోవ రామేశ్వరరావు కాలంలో సరళాదేవి పేరు మీదుగా ఒక చెరువులా నిర్మిం చారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని నిర్మాణం కోసం ఆయన ఇంజినీర్లను అమెరికాలోని కాలిఫోర్నియాకు పంపించి అధ్యయనం చేసిన తర్వాత శంకరమ్మపేటలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టారని తెలిపారు.
రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రో కూడా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రికి తెలి యక పోవడం విచారకరమని పేర్కొన్నారు. శాసనసభ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేయడం మంత్రులకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవగాహనకు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు.