సారంగదరియా రిలీజ్‌కి రెడీ

Sarangadariya is ready for releaseరాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్‌ పతాకంపై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్‌ పండు) దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్‌ చంద్ర నిర్మించిన చిత్రం ‘సారంగదరియా’. ఈనెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్‌ లాంచ్‌ చేశారు. ‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’, ‘మందు, సిగరెట్‌, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్‌.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్‌ అయి కూర్చుంటుంది’. అనే డైలాగ్స్‌ కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో రాజా రవీంద్ర ఓ మిడిల్‌ క్లాస్‌ ఫాదర్‌, గొప్ప ఉపాధ్యాయుడిగా కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌లో వినిపించే పాటలు, ఆర్‌ఆర్‌ చక్కగా ఉన్నాయి. వినరు కొట్టి రాసిన డైలాగ్స్‌ ఆలోచింపజేసేలా ఉన్నాయి.