సారస్వత పరిషత్తు పురస్కారాల ప్రదానోత్సవం

నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
తెలంగాణ సారస్వత లోకానికి 80 ఏండ్లుగా ఆత్మీయ సంస్థగా ఉన్న పరిషత్తు తన కృషిని భవిష్యత్తులో కూడా ప్రమాణాలు తగ్గకుండా అంకితభావంతో కొనసాగి స్తుందని అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. లోకనంది శంకర నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, నూకలనరోత్తమ రెడ్డి, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి వంటి పెద్దల బాటలో నడుస్తామని చెప్పారు. 2023 సంవత్సరానికి గాను వివిధ ప్రక్రియల్లో పోటీలో గెలుపొందిన ఉత్తమ గ్రంథాలకు ఆచార్య ఎల్లూ రి శివారెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె చెన్నయ్యతో కలిసి పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది పెండ్యాల కిషన్‌ శర్మ రచించిన శ్రీ వరదాభ్యుయం పద్య కావ్యానికి, హనీఫ్‌ రచించిన నాది ద్ణుఖం వీడని దేశం అనే వచన కవితా సంపుటానికి పురస్కారాలు అందజేశారు. కథా ప్రక్రియలో డాక్టర్‌ టి.సంపత్‌ కుమార్‌ రచించిన నా నుంచి మన వరకు గ్రంథానికి, నవలా ప్రక్రియలో వి. శాంతి ప్రబోధ రచించిన బతుకు సేద్యం గ్రంథానికి, విమర్శ ప్రక్రియలో ఆడెపు లక్ష్మీపతి రచించిన దిక్చక్రం వ్యాస సంపుటికి పురస్కారాలు అందజేశారు. వీరందరికీ రూ.20వేల చొప్పున నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఇతర ప్రక్రియల్లో న్యాయ నిర్ణీతల పరిశీ లనలో సమానమైన స్థాయి పొందిన దేవనపల్లి వీణా వాణి రచించిన ధరణీరుహ,హెచ్‌.రమేష్‌ బాబు రచించిన లోటస్‌ ఫిలిం కంపెనీ -హైదరాబాద్‌ గ్రంథాలకు బహు మతి మొత్తాన్ని చెరి రూ.10వేల చొప్పున అందజేశారు. ఈ ఏడాది వరిష్ఠ పురస్కారాల కింద ఆశారాజు, జూపాక సుభద్ర, వారాల ఆనంద్‌, గుడిపాటిలకు పరిషత్తు తరపు న పురస్కారాలు అందించారు. రూ.20 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య స్వాగతో పన్యాసం చేస్తూ తెలంగాణలో వివిధ ప్రక్రియల్లో తెలుగు సాహిత్యం ఉత్తమ ప్రమాణాలతో వెలువడుతున్నదన్నారు. తెలంగా ణ జన జీవితం ఈ రచనల్లో మునుపటి కన్నా ఎక్కువగా ప్రతిఫలిస్తున్నదని చెప్పారు. పరిషత్తు ఉపాధ్యక్షులు డా.ముదిగంటి సుజాతారెడ్డి, కోశాధికారి మంత్రి రామా రావు, ట్రస్ట్‌ సభ్యులు డాక్టర్‌ సి. వసుంధర పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యుడు రింగు రామ్మూర్తి సభా సమ న్వయం చేశారు. పురస్కార గ్రహీతలు తమ స్పందనను తెలియజేశారు.