సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల ఆత్మీయ సమావేశ కలయిక     

నవతెలంగాణ – కోరుట్ల
మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక కార్యక్రమం ఆదివారం రోజు పట్టాహస్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ వేముల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ కలయిక లో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, పాఠశాల శ్రేయోభిలాషులు పుర ప్రముఖులు 100 మంది పాల్గొని ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ, ప్రభుత్వ ఉపాధ్యాయులు గోల్కొండ నాగరాజు మాట్లాడుతూ శిశు మందిరం పాఠశాలలు సంస్కృతి సంప్రదాయాలకు నెలవని, వీటిలో చదివిన పిల్లలను నిఖార్సైన దేశ భక్తులుగా  తయారు చేస్తూ జాతికి ఉత్తమ పౌరులను అందిస్తుందని ఇలాంటి శిశు మందిరం పాఠశాలల అవసరం నేటి సమాజంలో ఎంతో ఉందని, అందరం కలిసి పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడపడానికి తమ వంతుగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు బండారు కమలాకర్, ప్రస్తుత ప్రబంధకారిణి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వేముల రవికిరణ్, వనపర్తి చంద్ర మోహన్, సహ కార్యదర్శి ఎలిమిల్ల మనోజ్ కుమార్,కోశాధికారి కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్,సభ్యులు అందె శివ ప్రసాద్, కొండ బత్తిని అమర్ నాధ్, పాలెపు సాయి దివ్య, వనపర్తి రమ్య, సమితి, కార్యదర్శి చెట్ పల్లి శంకర్, సమితి సభ్యులు మంచాల జగన్, ముదిగొండ రాజేశం, పిస్క రమేష్, ప్రస్తుత ప్రధానాచార్యులు గోపు వెంకటేష్,ఆచార్య బృందం తదితరులు పాల్గొన్నారు.