
నవతెలంగాణ – అశ్వారావుపేట
విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శరత్ బాబు ప్రభుతైవాన్ని డిమాండ్ చేసారు. ఆ సంఘం జిల్లా కార్యవర్గం సమావేశం మండల కమిటీ ఆద్వర్యంలో శాఖా అద్యక్షులు పున్నెం పుల్లయ్య అద్యక్షతన బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శరత్ బాబు మాట్లాడుతూ ఆరోగ్య సౌకర్యాల విషయంలో ఏర్పాటు చేసిన “హెల్త్ ట్రస్ట్” ను సమర్ధంగా కొనసాగించాలని, పెన్షన్ దారులు నుండి 1% చందా వసూలు చేసి ప్రభుత్వం నుండి దానికి సమానంగా వేసుకొని ట్రస్టు ను సమర్థంగా కొనసాగిస్తూ కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్య సౌకర్యం కల్పించాలని,పెన్షన్ కమిటేషన్ రికవరీ పీరియడ్ ను 15 నుండి 12 సంవత్సరాలకు తగ్గించాలని,పెండింగ్ లో ఉన్న నాలుగు విడతల డి.ఆర్. లను విడుదల చేయాలని,మంచి ఫిట్ మెంట్ తో పీ.ఆర్.సి. ఇవ్వాలని, బస్సులు, రైళ్ళలో రిటైర్డ్ ఉద్యోగులకు రాయితీ ఇవ్వాలని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పతాకంలో గృహ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెస్లీ, వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్ షులు నారాయణరావు, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, చం డ్రుగొండ, సుధాకర్ రావు, ఇల్లందు మండల అద్యక్షులు ఎల్.రాములు, సీ హెచ్.బ్రహ్మా రావు, భూషణ్ రావు, వి.స్వామి దాసు లు పాల్గొన్నారు.