“ప్రజాపాలన విజయోత్సవాలపై సారథి కళాకారుల ప్రదర్శన” 

"Saarthi Artists Exhibition on Victory Celebrations of Democracy"నవతెలంగాణ – తాడ్వాయి 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాల ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఈనెల 19వ తేదీ నుండి డిసెంబర్ 7 వరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ములుగు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షణలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఎండి రహీముద్దీన్ కళా బృందం బుధవారం తాడ్వాయి మండలం కాటపూర్, బిరెల్లి, ఊరట్టం గ్రామాలలో ఆరు గ్యారంటీల పథకాలను వివరిస్తూ కళాజాత నిర్వహించారు. ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ ఆటపాటలతో చైతన్యం కల్పించారు. జానపద గేయాలు ఆట పాటలు గ్రామీణులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో  రహీముద్దీన్,  మార్త రవి, రాగుల శంకర్, రేలా విజయ్, బోడ కిషన్, అమ్మ పాట తిరుపతి, గోల్కొండ నరేష్, శ్రీలత, శోభ తదితరులు పాల్గొన్నారు.