సారథి సూర్యకుమార్‌ ఐసీసీ టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

సారథి సూర్యకుమార్‌ ఐసీసీ టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌దుబాయ్ : భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ20 జట్టుకు సారథిగా నిలిచాడు. యశస్వి జైస్వాల్‌, రవి బిష్ణోరు, అర్షదీప్‌ సింగ్‌ సైతం జట్టులో చోటు సాధించారు. 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లతో ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను విడుదల చేసింది.
ఐసీసీ టీ20 జట్టు : యశస్వి జైస్వాల్‌, ఫిల్‌ సాల్ట్‌, నికోలస్‌ పూరన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, సికందర్‌ రజా, రంజాని, మార్క్‌ ఎడైర్‌, రిచర్డ్‌, రవి బిష్ణోరు, అర్షదీప్‌ సింగ్‌.