సర్దార్‌ 2 నాయిక..

సర్దార్‌ 2 నాయిక..హీరో కార్తి నటించిన ‘సర్దార్‌’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ఇటివలే ‘సర్దార్‌ 2’ రెగ్యులర్‌ షూటింగ్‌ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్‌ మిత్రన్‌ దీనికీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ నిర్మించనుంది. తాజాగా మేకర్స్‌ ఓ క్రేజీ అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో మాళవిక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తు న్నట్లు తెలిపారు. ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో ఎస్‌ జె సూర్య నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మాత ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. దీనికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.