దాచారంలో సర్దార్ పాపన్న జయంతి వేడుకలు 

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద సర్పంచ్ పెంటమీది శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం సర్దార్ పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి.. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. గ్రామంలోని గౌడ కులస్థులు పాల్గొన్నారు.