
నవతెలంగాణ-భీమారం
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం భీమారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పోలంపల్లి గ్రామంలోని తాళ్ల గూడెం రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ వీరుడని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతితగా నిలిచిపోయాడని కొనియాడారు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఓ కల్లుగీత కార్మికుడిగా మొదలైన ఆయన ప్రస్థానం శిస్తుల పేరుతో ప్రజలను దోచుకుంటున్న అసమానతలపై పోరాటానికి వలపు తిరిగింది. సమాజంలో పేద ప్రజల పై అణిచివేతకు అడ్డుకట్ట వేయడానికి సైన్యాన్ని సమకూర్చుకొని రాజ్యాలను స్థాపించిన మహావీరుడని అన్నారు. కార్యక్రమంలో పున్నం గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మొండయ్య గౌడ్, సమ్మ గౌడ్, శ్రీనివాస గౌడ్, రాజా గౌడ్, శ్రావణ్, ప్రణీత్ గౌడ్ పాల్గొన్నారు.