యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా సర్దార నియామకం

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సర్దార్ నాయక్ ను నియమించినట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్ రాజు గారి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సర్దార్ నాయక్ కు ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సర్దార్ నాయక్ మాట్లాడుతు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.