నూతన హాంగులతో సర్కార్ బడులు..

– ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రసమయి
నవతెలంగాణ-బెజ్జంకి
నూతన హాంగులు,సకల సౌకర్యాలతో పాఠశాల భవనాలను నిర్మిస్తూ సర్కార్ చదువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.మన ఊరు-మన బడి కార్యక్రమంలో మండల కేంద్రంలో సుమారు రూ.73.5 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవాన్ని సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ప్రత్యేక నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంపోందించేల గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు,యువత ప్రధాన భూమిక పోషించాలని ఎమ్మెల్యే రసమయి సూచించారు.విద్యార్థుల చదువులకు అటంకం ఏర్పడకుండా పాఠశాల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసిన గుత్తేదారు బాలయ్యను ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు.అనంతరం ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న బోజనం చేశారు.గురుపౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత,సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ శారధ,ఎంపీడీఓ రాము,ఎంఈఓ పావని, అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, ప్రధానోపాద్యాయులు శంకర చారీ, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.