సర్కార్‌ సిగ్గుతో తల దించుకోవాలి

– ‘గచ్చిబౌలి’ ఘటనపై మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు ఆగడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ”హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగింది. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. రాష్ట్రంలో నేరాల రేటు గణనీయంగా పెరిగింది. శాంతి భద్రతలు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. హౌం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క రోజూ శాంతి భద్రతలపై సమీక్ష చేయలేదు. మహిళల భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాం టి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం. నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్య తీసుకోవాలి” అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.