
మండల పరిధిలోని రేగులపల్లి గ్రామ సర్పంచ్ జన్మదిన వేడుకలను గ్రామంలోని యువత గురువారం ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో గ్రామంలోని యువత సర్పంచ్ ఐలయ్యను గడమాలతో సత్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.గ్రామంలోని సబ్బండ వర్గాల ప్రజలకు తనదైన శైలిలో చురుకైన పాత్ర పోషిస్తూ నిష్పక్షపాతమైన సేవలందిస్తూ గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన సర్పంచ్ ఐలయ్యకు యువత కృతజ్ఞతలు తెలిపుతూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.