సర్పంచ్ దండ మనోహర్ రెడ్డి వీడ్కోలు, ఆత్మీయ సన్మానసభ

– పదవీ కాలం పూర్తయిన సందర్బంగా ఘన సన్మానం
– ఐదేళ్లు ప్రజాసేవ చేశామన్న సర్పంచి
నవతెలంగాణ – పెద్దవూర
ఐదేళ్లుగా గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించిన పర్వేదుల సర్పంచ్ దండ మనోహర్ రెడ్డి ని, ఉపసర్పంచ్ రమావత్ బుజ్జిబాబు, వార్డు మెంబర్ల ను సోమవారం మాజీ ఎంపిపి శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇంద్రగంటి వెంకటయ్య, కోఆప్షన్ సభ్యులు ఎస్ కే బషీర్, షాలువకప్పి పూల బుకేలు అందించి, ఘన సన్మానం చేశారు. ఈసందర్బంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం పదవి కాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సన్మానం చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ దండ మనోహర్ రెడ్డి  గత ఐదు సంవత్సరాలుగా ప్రజల సహకారంతో, అన్ని వర్గాల సమన్వయంతోకలుపుకొని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అంతేగాక వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ చైతన్యంతో అభివృద్దికి తోడ్పడడం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కంటే అభివృద్ధి లో ముందు వరుసలో ఉంచిందన్నారు. ఇదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నిజాయితీగా, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వారిని పాలకవర్గ సభ్యులు ఎన్నుకోవాలని వారు కోరారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు.పంచాయతీ కార్యదర్శి సాధిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఆత్మీయ సన్మాన సభలో ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూల కంటి రంగారెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు మునిలాల్,పిఏసి ఎస్ డైరెక్టర్ పాల్తీ శ్రీను,పాల్తీ శంకర్, పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ రెడ్డి,నాగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.