సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముకుమ్మడి రాజీనామాలు..

– మా ఊరు అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోకపోవడమే మా రాజీనామాలు పాటి మార్పు
నవతెలంగాణ- మద్నూర్: గడిచిన 10 సంవత్సరాలు కాలంగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అధికారంలో ఉన్నప్పటికీ మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టగా పోవడం మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పది సంవత్సరాల కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దన్నూర్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పార్టీ అధ్యక్షులకు ఎమ్మెల్యే హనుమంతు ఎలాంటి సమాచారం. ఇవ్వకుండా మా మాటలు పట్టించుకోకుండా వ్యతిరేకులకే అనుకూలంగా పనిచేస్తున్నాడని మా గ్రామ సమస్యలు విన్నవించాలంటే మా మాటలు వినకపోవడమే మేమంతా ముక్కుమ్మడిగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామాలు చేస్తూ జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు మా రాజీనామాలకు కారణం ప్రత్యేకంగా ఎమ్మెల్యే హనుమంతు పిండే నాని సర్పంచ్ ముక్తాబాయి మారుతి ఉప సర్పంచ్ రుక్మిణి బాయి విట్టల్ ఎంపిటిసి సభ్యులు యాదవరావు పటేల్ ఆ గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు పాండురంగ పాటిల్ తెలిపారు 10 సంవత్సరాల కాలంగా గ్రామ ప్రజలు అత్యవసరానికి రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యాడని మా సమస్యలు పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. ఇలాంటి ఎమ్మెల్యే ఎన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు తీరవని మార్పే దీనికి పరిష్కారమని తామంతా ముక్కమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు దన్నూర్ గ్రామంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ కండువాలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంగా అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హనుమంతు షిండే దన్నూరు గ్రామ ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జుక్కల్ ఎమ్మెల్యేగా తాను గెలవడానికి గ్రామ ప్రజలంతా చేతు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు