నర్సింగ్ ఆఫీసర్ గా నియామకమైన వెంకటేష్ గౌడ్.. సన్మానించిన సర్పంచ్..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్ గౌడ్ నర్సింగ్ ఆఫీసర్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించగా, ఆయనను తాజా మాజీ సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, మాజీ సర్పంచ్ బాబన్న లు శాలువా కప్పి మెమొంటులను అందజేశారు. దూపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన టి. వెంకటేష్ గౌడ్ తమ గ్రామానికి గర్వకారణమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.