కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ గౌరాజీ లలిత రాఘవేందర్..

నవతెలంగాణ- రెంజల్

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించేందుకు వికాసి భారత్ సంకల్పయాత్ర ను ప్రారంభించినట్లు ఎంపీడీవో శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం రెంజల్ మండలం నీలా గ్రామంలో సర్పంచ్ గౌరాజీ లలిత రాఘవేందర్ అధ్యక్షతన సంకల్ప యాత్ర ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 17 శాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలోని పథకాల గురించి వివరించారు. అర్హులైన నిరుపేదలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇల్లు లేని నిరుపేదలు, ఇంతవరకు గ్యాస్ సిలిండర్ లేని కుటుంబాల వారు తమ ఆధార్ కార్డును అధికారులకు అందజేసి ఉచితంగా వాటిని పొందవచ్చని వారు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిరుపేదల కు ఎంతో మేలు జరుగుతుందని, పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రెంజల్ మండల ఉపాధ్యక్షులు ఖ్యాతం యోగేష్ పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ పథకాలతో పాటు అధికారులు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, ఉప సర్పంచ్ మారా నాగభూషణం, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, గ్రామ కార్యదర్శి బి రాణి, స్థానిక నాయకులు రాఘవేందర్, సాయిలు, కారోబర్ రమేష్, అంగన్వాడి కార్యకర్తలు ఆశలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.