సూపరిండెంట్ ప్రతిమరాజ్ కు సర్పంచ్ శుభాకాంక్షలు

నవతెలంగాణ -నవీపేట్: మండలంలోని యంచ సర్పంచ్ లహరి ప్రవీణ్ కుమార్ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ గా ప్రతిమరాజ్ బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా కేక్ కట్ చేసి పుష్పగుచ్చం ఇచ్చి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధితో పాటు రోగుల పట్ల సహృద్భావంతో మెలుగుతూ రాష్ట్రంలోనే  ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినందుకు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, అరుణ్, శ్రావణ్ పాల్గొన్నారు.