నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గౌరరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నీదులతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి గోపి ముదిరాజ్ పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఇమ్మడి లక్ష్మి గోపి ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్ఆర్ జీఎస్ పథకం లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 18 లక్షల నీదులు మంజూరయ్యాయని దానిలో భాగంగానే గ్రామపంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన గ్రామస్తులకు, పాలకవర్గ సభ్యులకు అధికారులకు, అనధికారులకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోదా స్వామి వార్డు సభ్యులు లావణ్య, లతా, మహిత, జమున, రమేష్ ,బండ పద్మ, ఏం సాయిలు, పంచాయతీ కార్యదర్శి సుశీల, కారోబార్ రవి తోపాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళా సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు