
మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ సిద్ది లింగమూర్తి, ఉప సర్పంచ్ కోడూరి మమతలకు మంగళవారం బీసీజాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా ఇన్చార్జి విజయ గిరి సమ్మయ్య మాట్లాడుతూ.. నూతన గ్రామపంచాయతీ ఏర్పడిన కొయ్యూరు గ్రామ మొదటి సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గం గ్రామాభివృద్ధి కృషి చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గుర్తించి వెంటనే, గ్రామ సర్పంచ్ కు రూ.10వేలు, ఉప సర్పంచ్ రూ. 5వేలు, వార్డ్ మెంబర్స్ రూ.2వేలు, నెలసరి వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు యాదండ్ల రామన్న యాదవ్, కోడారి చిన్న మల్లయ్య యాదవ్, సమ్మయ్య, రాజయ్య,రవి, గట్టయ్య, తిరుపతి, పోతరాజు, శంకర్, మహిళ నాయకురాలు రజిత పాల్గొన్నారు.