సర్పంచ్ ఎండి మంజూర్ ను సన్మానించిన లొంక కేసారం గ్రామ ప్రజలు 

నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలంలోని లొంక కేసారం గ్రామపంచాయతీ పాలకవర్గ పదవీ కాలం ముగిసిన సందర్భంగా  గ్రామ సర్పంచ్ ఎండి మంజూర్, ఉపసర్పంచ్ ఒజ్జ ఓదెలు వార్డ్ సభ్యులను ఎంపిటిసి, కార్యదర్శి పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు  మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి ఐదు సంవత్సరాలుగా వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎండి మంజూర్ మాట్లాడుతూ.. సర్పంచ్ గా నన్ను నాతో పాటు పాలకవర్గాన్ని ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, గడిచిన ఐదు సంవత్సరాలుగా గ్రామంలోని డ్రైనేజీలు, వీధి దీపాలు, పల్లె ప్రగతి, వానర వనం, రోడ్లు, ఇంకుడు గుంతలు మొదలగు పనులు 100% పూర్తి అవడంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు గ్రామ పాలకవర్గానికి సన్మానం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొట్టె సందీప్, కార్యదర్శి అమల, సిఎ, అంగన్వాడి టీచర్స్ శ్యామల, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .