వధూవరులను ఆశీర్వదిస్తున్న సర్పంచ్ నర్సయ్య

– కల్యాణ కానుక అందజేత
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్ట మచ్చయ్య-సుజాతల కుమార్తె హారిక వివాహం శుక్రవారం జరిగింది. కాగా నూతన వధూవరులను సర్పంచ్ పోతుల నర్సయ్య ఆశీర్వదించి కల్యాణ కానుకగా రూ.5వేల పదహార్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వార్డు సభ్యులు చింతల రాజయ్య, గ్రామస్తులు కట్ట శ్రీనివాస్, అడిగొప్పుల వెంకటేష్, పోతుల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.