– ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో అధికారులపై గరం గరం
– బదిలీపై వెళ్తున్న ఎంపీడీవోకు సత్కారం
నవతెలంగాణ – నవీపేట్
గ్రామాలలో సర్పంచ్ ల పదవీకాలం పూర్తి కావడంతో గ్రామాలలో ప్రస్తుతం ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎంపీటీసీలకు సర్పంచుల బాధ్యతను బదిలాయించాలని తీర్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజా పాలన కోసం సర్పంచ్ ల పదవి కాలం పూర్తి కావడంతో ఆ బాధ్యతను ఎంపీటీసీలకు బదిలాయించాలని ఎంపీటీసీలు ఎంపీపీ దృష్టికి తీసుకురావడంతో ఏకగ్రీవంగా తీర్మానించారు. అబ్బాపూర్(ఎం) నుండి నాగేపూర్ వరకు నిర్మించిన సెంట్రల్ లైటింగ్ పనిచేయడం లేదని నాణ్యత లోపం వల్లనే ఫలితం లేకుండా పోయిందని ట్రాన్స్కో, ఆర్ అండ్ బి ఏ ఈ లను ఎంపీపీ శ్రీనివాస్ నిలదీశారు. గత ప్రభుత్వ రైతు బంధు, రైతు బీమా పథకాలను కొనసాగించాలని ఇప్పటివరకు 3 ఎకరాల 11 గుంటల వరకు ఉన్న రైతులకు రైతుబంధు వచ్చిందని మిగతా రైతులకు వెంటనే వచ్చేలా చూడాలని తీర్మానించారు. నాలేశ్వర్ నుండి నిజామాబాద్ వరకు గతంలో డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పి సింగల్ రోడ్డు నిర్మిస్తున్నట్లు ఆర్ అండ్ బి అధికారులు చెప్పడం విడ్డూరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ లేకపోవడం వలన ప్రసూతి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీటీసీ సతీష్ సభ దృష్టికి తీసుకురావడంతో వెంటనే అపాయింట్మెంట్ చేయాలని తీర్మానించారు. అలాగే ఆసుపత్రి స్థలం కాపాడేందుకు ఎంపీపీ శ్రీనివాస్ కృషి చేయడం పట్ల సభ్యులు అభినందించారు. బినోల పిహెచ్ సీ కి 108 అందుబాటులో ఉంచాలని ఎంపిటిసి కృష్ణమోహన్ తెలిపారు. అనంతరం గత 8 సంవత్సరాలుగా ఎంపీడీవో గా విధులు నిర్వహించి బదిలీపై కామారెడ్డికి వెళ్తున్న సాజిద్ అలీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ధన్వాల్, ఎంపిటిసిలు మీనా, రాధా, సాయిలు, మండల అధికారులు పాల్గొన్నారు.