నవతెలంగాణ – ఉప్పునుంతల: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని వెల్టూర్ గ్రామ సర్పంచ్ రెడ్డి రెడ్డి సుగుణమ్మ అన్నారు. గురువారం ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న ప్రజా పాలనలో ఆరు గ్యారంటీల అమలుపై దరఖాస్తుల స్వీకరణ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని వారు అన్నారు. ప్రజలు ప్రజా పాలనలో అధికారులు సమన్వయంతో ప్రజలకు చేరువగా సంక్షేమ పథకాలు అందేలా చూడడం గొప్ప కార్యక్రమం మని అన్నారు. తొమ్మిదిన్నర ఏండ్లుగా సామాన్యులకు కనీసం ఇండ్లు రేషన్ కార్డు కొత్త ఫించన్ ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తల్లి సోనియమ్మ రుణం తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారనే పేదలకు న్యాయం జరుగుతుందని అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. కచ్చితంగా ప్రజా పాలనలో ప్రజలకు ప్రతిఒక్కరికీ సంక్షేమ అభివృద్ధి జరగడమే లక్ష్యంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ముందుకు పోతుందని వారు అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు మంచి స్పందన లభిస్తోందని ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తులు పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రంగారెడ్డి, ఎంపీ ఓ నారాయణ, పంచాయితీ సెక్రటరీలు ఉమాశంకర్, శశాంక్ రెడ్డి వెంకటేష్ మరియు పలు శాఖల అధికారులు, గ్రామ ముఖ్య నాయకులు. లింగామయ్యా, గుద్దటి బాలరాజు, దేవేందర్, మల్లయ్య, శ్రీశైలం, జనార్ధన్, వెంకటయ్య సైదులు శ్రీను కృష్ణ, రాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు.