బోరు డ్రిల్లింగ్ ను ప్రారంభించిన సర్పంచ్

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని బస్వాపూర్ గ్రామములో సర్పంచ్ రవిపటేల్  బోరు తవ్వకం డ్రిల్లింగ్ ను ప్రారంబించారు. ఈ సంధర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాబోయేది ఎండకాలం దృష్టిలో ఉంచుకుని, నీటీ ఎద్దడి రాకుండా జీపీ నిధులతో బోరు వేయడం జరిగిందనన్నారు.  నీరు బాగా వచ్చాయని, రెండున్నర ఇంచ్ ల నీరు పడిందని, సంతోషం వ్యక్తం చేసారు. నీటి సమస్య ఉన్నప్పటికీ చాలా సార్లు బోరువేసిన నీరు పడలేదని , ఇప్పుడు గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. సర్పంచ్ తో పాటు జీపీ    పాలక వర్గం ఉన్నారు.