నవతెలంగాణ బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో 3వ వార్డులో డ్రైనేజీ పైపులైను పనులను సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్ గౌడ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ నిధుల నుండి 35 లక్షలతో డ్రైనేజ్ పనులు, సిసి రోడ్డు పనులను ప్రారంభించినట్టు తెలిపారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు చేకూర్చేలా తోడ్పడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.