
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచు పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం నాడు గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ సూర్యకాంత్, ఉప సర్పంచ్ విట్టల్ లను పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ శాలువా తో సన్మానించారు. అదేవిధంగా వార్డు సభ్యులను గ్రామపంచాయతీ అధికారులు సన్మానించారు. మద్నూర్ గ్రామ అభివృద్ధికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల కృషి చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ చంద్రకాంత్, బిల్ కలెక్టర్, అటెండర్ జాకీర్, వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.