నవతెలంగాణ నూతనకల్: డి టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ , డైరీ ని సర్పంచ్ తీగల కరుణ శ్రీ గిరిధర్ రెడ్డి మంగళవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు వృత్తి నిబద్ధతతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమ సమాజ అభివృద్ధి కోసం చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని వారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యని అందించి ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ నాయకులు రేపాక లింగయ్య, బయ్య దేవేందర్ బిక్షం క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు