మేనూర్ గ్రామానికి గ్రంథాలయం మంజూరు ప్రారంభించిన సర్పంచ్ విట్టల్ గురుజి

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామానికి నూతన గ్రంథాలయం మంజూరు అయింది. మంజూరైన గ్రంథాలయాన్ని ఆ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ సగభాగంలో ఒక పోర్షన్ గా ఏర్పాటు చేసి నూతన గ్రంథాలయాన్ని మంగళవారం నాడు ప్రారంభించారు. గ్రంథాలయ ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ విట్టల్ గురూజీ, ఉపసర్పంచ్ మోహన్, మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య, మద్నూర్ గ్రంథాలయ శాఖ అధికారి రాజు ఆ గ్రామ ముఖ్య నాయకులు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వై.గోవింద్ ఎంపీటీసీ సభ్యుడు మందాకిని శ్రీనివాస్ గౌడ్ మండల కో ఆప్షన్ నెంబర్ నిజాముద్దీన్ ఆ గ్రామ కార్యదర్శి సురేష్ ఇతర అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.