నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దూపల్లి పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి సార్వభక్తి పూలమాలతో ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాలుగా సర్పంచి గ్రామ అభివృద్ధితో పాటు, పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని ప్రధానోపాధ్యాయులు గణేష్ రావు అన్నారు. సర్పంచ్ పదవి కాలం పూర్తి కావడంతో ఆయనను శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గణేష్ రావు, పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయి రెడ్డి, ఉపాధ్యాయులు బి. వెంకటలక్ష్మి, రాజేశ్వర్, రాధా, పరమేశ్వర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.