
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల కృషి ఎనలేనిదని గ్రామంలో ఏ పని చేసిన ఒక్క రూపాయి అవినీతి చేయకుండా పనులను పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని గ్రామ అభవృద్ది కమిటీ సభ్యులు, యువజన నాయకులు క్రాంతి, వినోద్ రెడ్డి, మహేందర్, అరవింద్ గౌడ్, రాకేష్ అన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలంలోని సుద్ద పల్లి గ్రామంలో సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డి,ఉప సర్పంచ్ గంగారాం పాలక వర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు రాకుండా సర్పంచ్ పాలకవర్గం ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, గ్రామంలో ఒక్క రూపాయి అవినీతి చేయకుండా అభివృద్ధి వైపు గ్రామాన్ని తీసుకెళ్లి తన సొంత డబ్బులతో పనులు చేయించిన సర్పంచ్ రూపా సతీష్ రెడ్డి భవిష్యత్తులో మంచి పదవిలో కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నమని వివరించారు.గ్రామంలో సిసి రోడ్డు, మంచినీటి వసతులు, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ నిర్మాణం, హరితహారం తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుండి చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన ముందుండి పనులను పూర్తి చేయించారని అన్నారు. ఐదేళ్లపాటు రెయిన్బోలు అభివృద్ధి చేసి పదవి విరమణ చేస్తున్న పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఎంపీటీసీ ఎంబడి సంతోషం, గ్రామ అభవృద్ది కమిటీ సభ్యులు యువజన నాయకులు క్రాంతి, వినోద్ రెడ్డి,మహేందర్, అరవింద్ గౌడ్ ,రాకేష్ ,తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.