ప్రజాసేవలో సర్పంచ్ ల కృషి ఎనలేనిది

– హుస్నాబాద్ లో సర్పంచ్ లకు సన్మానం
– హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
సర్పంచ్ లు ఐదు సంవత్సరాలు పదవి కాలంలో గ్రామాలలో ప్రజలకు చేసిన సేవలు ఎనలేనిదని హుస్నాబాద్ ఎంపీపీ లతావత్ మానస అన్నారు. గురువారం ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో  సర్పంచుల  ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తయినందున పదవి విరమణ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పీ ఓ సత్యనారాయణ,, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం మదన్ మోహన్ రెడ్డి,  సర్పంచులు తోడేటి రమేష్, బత్తుల మల్లయ్య, బత్తిని సాయిలు, వంగ విజయలక్ష్మి, దుండ్రా భారతి, బత్తుల సునీత, తరాల లత, లావుడియా స్వరూప, పోలవేణి లత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు